madala rangarao: సీనియర్ సినీ నటుడు మాదాల రంగారావుకు తీవ్ర అస్వస్థత!

  • మాదాల రంగారావుకు గుండెపోటు
  • హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రికి తరలింపు
  • పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు  
టాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఆయనకు గుండెపోటు రావడంతో హైదారాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ సందర్భంగా మాదాల రంగారావు కుమారుడు మాదాల రవి మాట్లాడుతూ, ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని అన్నారు.

తన తండ్రికి గత ఏడాది గుండె ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. నిన్న మరోసారి ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించామని అన్నారు. కాగా, విప్లవ సినిమాల నటుడిగా, దర్శకుడిగా మాదాల రంగారావు ప్రసిద్ధి. ప్రజా నాట్యమండలిలో క్రియాశీలక సభ్యుడిగా పని చేశారు. మాదాల రంగారావు నటించిన తొలి సినిమా ‘చైర్మన్ చెలమయ్య’. కాగా, ‘యువతరం కదిలింది’, ‘ఎర్రమల్లెలు’, ‘ఎర్రపావురాలు’, ‘ప్రజాశక్తి’, ‘స్వరాజ్యం’ తదితర సినిమాల్లో ఆయన నటించారు.
madala rangarao
heart stroke

More Telugu News