petrol diesel: చుక్కలు చూపిస్తున్న డీజిల్, పెట్రల్ ధరలు... నిత్యం పెంపు

  • హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ.80.76
  • డీజిల్ ధర దేశంలోనే హైదరాబాద్ లో అధికం
  • లీటర్ రూ.74.35
  • ఎనిమిది రోజుల్లో పెట్రోల్ రూ.1.64, డీజిల్ రూ.1.61 చొప్పున పెంపు

కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి గత ఎనిమిది రోజులుగా డీజిల్, పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూ పోతున్నాయి. దీంతో పెట్రోల్ ధర హైదరాబాద్ లో 80.76కు చేరింది. ముంబైలో అత్యధికంగా 84.07 కావడం గమనార్హం. డిజిల్ ధర దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లో రూ.74.35కు చేరుకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అదనపు పన్నులు, రవాణా పరమైన వ్యత్యాసాల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ధరల్లో ఎంతో వ్యత్యాసాలు ఉంటాయి.

కర్ణాటక ఎన్నికల కోసం రేట్ల పెంపును కేంద్ర సర్కారు 19 రోజుల పాటు ఆపి వేయించింది. కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఎనిమిది రోజుల్లో పెట్రోల్ రూ.1.61, డీజిల్ రూ.1.64 చొప్పున పెరగడం గమనార్హం. భోపాల్ లో పెట్రోల్ ధర రూ.81.83, పాట్నాలో రూ.81.73, శ్రీనగర్ లో రూ.80.35 గా ఉంది. కోల్ కతాలో రూ.78.91 కాగా, చెన్నైలో రూ.79.13. దేశంలోనే పెట్రోల్ ధర తక్కువగా లభిస్తున్న ప్రాంతం పంజిమ్. ఇక్కడ ధర రూ.70.26 మాత్రమే. డీజిల్ ధర త్రివేండ్రంలో రూ.73.34, రాయిపూర్ రూ.72.96, భువనేశ్వర్ లో రూ.72.43 చొప్పున ఉంది. అతి తక్కువగా పోర్ట్ బ్లెయిర్ లో రూ.63.35గా ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News