ప్రియుడి కోసం భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో మలుపు!
- విజయనగరం జిల్లాలో కలకలం రేపిన కేసు
- పెళ్లికి ముందే భర్తను చంపించాలని పన్నాగం
- బెంగళూరులోని తన స్నేహితురాలి సహకారం కోరిన సరస్వతి
బెంగళూరులో గౌరీ శంకర్ ఉద్యోగం చేస్తుండగా, ఆయన్ను అక్కడే హత్య చేయించేందుకు తన స్నేహితురాలితో కలసి వివాహానికి ముందే సరస్వతి ప్లాన్ చేసిందని, అయితే, బెంగళూరులో ఆమె పన్నాగం ఫలించలేదని పోలీసులు తేల్చారు. ఈ కేసును విచారిస్తుంటే, బెంగళూరుకు చెందిన సరస్వతి స్నేహితురాలి ప్రమేయం గురించి తెలిసిందని, ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.