mamatha benarji: ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి నన్ను ఆహ్వానించారు: మమతా బెనర్జీ

  • కాసేపట్లో గవర్నర్‌ వద్దకు కుమారస్వామి
  • ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
  • అభినందనలు తెలిపిన మమతా బెనర్జీ
కర్ణాటకలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ నేత యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో జేడీఎస్‌ నేత కుమారస్వామి ఈ రోజు రాత్రి 7.30 గంటలకు కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలాని కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అంతేగాక, ఆయన తన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, కొద్ది సేపటి క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన ఫోన్‌లో సంభాషించినట్లు తెలుస్తోంది. తాజాగా మమతా బెనర్జీ ట్వీట్‌ చేస్తూ... 'కుమారస్వామితో మాట్లాడి అభినందనలు తెలిపాను.. సోమవారం ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు' అని పేర్కొన్నారు.      
mamatha benarji
Congress
jds
Karnataka

More Telugu News