kumaraswamy: తొందరపడటం లేదు.. గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం!: కుమారస్వామి

  • సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే.. బీజేపీ బేరసారాలు జరిపేది
  • ఎమ్మెల్యేల కష్టాలకు యడ్యూరప్పే కారణం
  • సీఎం కావాలని నేను తొందరపడటం లేదు

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయడంతో... తదుపరి సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కలయికతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కావడానికి తాను తొందరపడటం లేదని, గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే... ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరిపేదని అన్నారు. ప్రస్తుత కష్టాలన్నింటికీ యడ్యూరప్పే కారణమని... ఆయన వల్లే ఎమ్మెల్యేలు కష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పారు. 

More Telugu News