yeddyurappa: కర్ణాటక అసెంబ్లీలో ప్రారంభమైన యడ్యూరప్ప బలపరీక్ష.. కాంగ్రెస్, జేడీఎస్ లపై నిప్పులు చెరిగిన యడ్డీ

  • ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు
  • కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలవి అవకాశవాద రాజకీయాలు
  • ప్రజలు తిరస్కరించినా వారు ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్నారు

కర్ణాటకలో నెలకొన్న ఉత్కంఠభరిత రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనే కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వాసతీర్మానాన్ని యడ్యూరప్ప సభలో ప్రవేశపెట్టారు. అనంతరం యడ్డీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఈ సందర్భంగా యడ్యూరప్ప తెలిపారు. బీజేపీకి కర్ణాటక ఓటర్లు పట్టం కట్టారని... బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నుకున్నారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రజలు ఓడించారని చెప్పారు. గత రెండేళ్లగా తాను కర్ణాటక వ్యాప్తంగా పర్యటించానని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ లు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు తీరస్కరించినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడం బాధాకరమని చెప్పారు. 

More Telugu News