yaddyurappa: మరో ఊహించని మలుపు.. రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్న యడ్యూరప్ప?

  • మధ్యాహ్నం 3.30 గంటల వరకు అసెంబ్లీ వాయిదా
  • యడ్యూరప్ప రాజీనామా చేస్తారని గుర్తించిన జాతీయ మీడియా
  • పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని ప్రధాని సూచన?
  • విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా? 

కర్ణాటక శాసనసభ ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు, ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయనున్నట్లు కన్నడ, జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్న యడ్యూరప్ప కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం.  నిన్న గాలి జనార్దన్‌ రెడ్డి, నేడు యడ్యూరప్పల పేరుతో ప్రలోభాల టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అంతేగాక, కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ చేస్తోన్న కుయుక్తులపై దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షను చూసిన తరువాత తమ తదుపరి కార్యాచరణపై ప్రాంతీయ పార్టీలన్నింటితో చర్చిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నిన్న అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని ప్రధాని సూచించినట్లు సమాచారం. విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప.. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తారని తెలుస్తోంది.

More Telugu News