snartphone: 1టీబీ స్టోరేజీ స్మార్ట్ ఫోన్... ధర రూ.90,000పైనే

  • ఆర్1 పేరుతో విడుదలైన ఫోన్
  • చైనాకు చెందిన స్మార్టిసాన్ కంపెనీ ఆవిష్కరణ
  • 64 జీబీ స్టోరేజీతోనూ విడుదల

స్మార్ట్ ఫోన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చైనాకు చెందిన స్మార్టిసాన్ తాజాగా ఆర్1 పేరుతో 1టీవీ స్టోరేజీ సామర్థ్యం కలగిన ఫోన్ ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ ఫోన్ సాయంతో కంప్యూటర్ ను సైతం నడిపించొచ్చని కంపెనీ ప్రకటించింది. దీని ధర 1390 డాలర్లు. రూపాయిల్లో చెప్పాలంటే, సుమారు రూ.92,000.

ఈ ఫోన్లో 64 జీబీ స్టోరేజీ మోడల్ అయితే 549 డాలర్లకే (రూ.36,000) వస్తోంది. ఆన్ లైన్లో ఇది అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 6.17 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 12 ఎంపీ, 20ఎంపీ వెనుక కెమెరాలు, ముందు భాగంలో 24 ఎంపీ కెమెరా ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో వస్తుంది.

More Telugu News