monsoon: ఈ నెల 29న కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

  • జూన్ 1 నాటికి కేరళ దక్షిణ తీరంలో కురవనున్న వర్షాలు
  • జులై మధ్య నాటికి దేశ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం
  • వాతావరణ శాఖాధికారుల వెల్లడి
ఈ నెల 29న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి పదిహేను రోజుల్లోనే దేశంలో సగం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 1 నాటికి కేరళ దక్షిణ తీరంలోను, జులై మధ్య నాటికి దేశ వ్యాప్తంగాను వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ లో సోయాబీన్స్ ఎక్కువగా పండే ప్రాంతాల్లో జూన్ మూడో వారం నాటికి, పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో జులై మొదటి వారానికి వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖాధికారులు తెలిపారు.
monsoon
Kerala

More Telugu News