south africa: మా మూడో బిడ్డకు ‘తాజ్ మహల్’ అని పేరు పెడతా: క్రికెటర్ డివిలీర్స్

  • దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు జాంటీ రోడ్స్ బాటలో డివిలీర్స్
  • ప్రాచీన అద్భుత కట్టడం తాజ్ మహల్ పేరు పెడతా
  • గతంలో ‘తాజ్’ ను సందర్శించిన డివిలీర్స్ - డానిల్లే 
దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు జాంటీ రోడ్స్ కు మన దేశంపై ఎంత అభిమానం ఉందో చెప్పడానికి నిదర్శనం తన కూతురుకు ఇండియా జెన్ జాంటీ రోడ్స్ అని పేరుపెట్టడం. అదే బాటలో అదే దేశానికి చెందిన మరో క్రీడాకారుడు ఏబీ డివిలీర్స్ కూడా నడవనున్నాడు.

డివిలీర్స్-డానిల్లేకు కలగబోయే మూడో సంతానానికి మన దేశంలోని ప్రాచీన అద్భుత కట్టడం తాజ్ మహల్ పేరు పెట్టనున్నాడు. ఈ మేరకు డివిలీర్స్ ఓ ప్రకటన చేశాడు. కాగా, 2013లో డివిలీర్స్ - డానిల్లేల వివాహం జరిగింది. అంతకుముందు ఏడాదిలో భారత్ ను వీళ్లిద్దరూ సందర్శించిన సమయంలో అద్ధుతకట్టడం తాజ్ మహల్ ను దర్శించారు. అప్పుడు, డానిల్లేకు పెళ్లి ప్రపోజ్ చేశాడు డివిలీర్స్.
south africa
ab de villiers

More Telugu News