Tanya: బయటకురా... నీ పని చెప్తా: నటి తాన్యకు బెదిరింపులు

  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్
  • తాన్య కొత్త చిత్రం విడుదలకు రెడీ
  • దర్శక, నిర్మాతలతో సమస్యలు
  • పోలీసులను ఆశ్రయించిన తాన్య

దక్షిణాది నటి తాన్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్య చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె చెన్నై, వెపేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నో కాలర్ ఐడీ', 447404617369 నంబర్ల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. "నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నిన్ను చంపేస్తాను" అని బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె '18.05.2009' అనే చిత్రంలో నటించగా, అది విడుదలకు సిద్ధమైంది.

కాగా, వడపళని పరిధిలోని తిరునగర్ సెకండ్ స్ట్రీట్ లో తాన్య తన తల్లితో కలసి నివసిస్తుండగా, ఈ నెల 14 అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. "ఆ సినిమాలో నటించింది నువ్వేగా, బయటకు రా... నీ పని చెప్తా" అంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సినిమాలో తాను కేవలం నటించానని, అంతకు మించి తనకు సంబంధం లేదని, ఏమైనా సమస్య ఉంటే దర్శక, నిర్మాతలతో తేల్చుకోవాలని ఆమె చెప్పినా వినలేదు. ఇక సదరు గుర్తుతెలియని వ్యక్తి కాల్ తో తాను చాలా బయపడుతున్నానని, అతనిపై చర్యలు తీసుకోవాలని తాన్య, తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.

  • Loading...

More Telugu News