Karnataka: ఫ్లాష్ బ్యాక్: రైస్ మిల్లులో క్లర్క్‌గా పనిచేసి.. యజమాని కుమార్తెనే పెళ్లాడిన కర్ణాటక సీఎం!

  • సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన యెడ్డీ
  • 15వ ఏట నుంచే ఆరెస్సెస్‌లో..
  • 2013 ఎన్నికల్లో సొంత పార్టీ స్థాపించి విఫలం

హైడ్రామా నడుమ కర్ణాటక ముఖ్యమంత్రిగా భూకనకెరె సిద్దలింగప్ప యడ్యూరప్ప (75) మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సామాన్య రైతు కుటుంబంలో ఫిబ్రవరి 21, 1943న జన్మించారు. మాండ్యా జిల్లా కేఆర్ పేట తాలుకాలోని భూకనకెరెలో సిద్దలింగప్ప-తాయమ్మ దంపతులకు జన్మించిన యడ్యూరప్ప 15 ఏళ్ల వయసు నుంచే ఆరెస్సెస్‌లో చురుగ్గా పనిచేశారు.

1965లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిగా చేరిన యడ్యూరప్ప తర్వాత ఆ ఉద్యోగానికి టాటా చెప్పారు. 1967లో శికారిపురలో ఓ రైస్ మిల్లులో క్లర్క్‌గా చేరారు. అనంతరం మిల్లు యజమాని కుమార్తె మైత్రాదేవిని పెళ్లాడారు. శికారిపుర పురసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన యెడ్డీ 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మనకు తెలిసిందే.

More Telugu News