Karnataka: కర్ణాటకలో బీజేపీ వైఖ‌రికి నిర‌స‌న‌గా రేపు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు: రఘువీరారెడ్డి

  • రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలను కాపాడాలి
  • కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో నిరసన తెల‌పాలి
  • బీజేపీ మొండి వైఖ‌రి అవలంబిస్తోంది

కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ వైఖ‌రికి నిర‌స‌న‌గా, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలను కాపాడేందుకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఉద్యమించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

బీజేపీ మొండి వైఖ‌రికి నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపు నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో నిరసన తెల‌పాల‌ని పిలుపు నిచ్చారు. కాగా, రేపు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ గెహ్లాట్ దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.    

  • Loading...

More Telugu News