governer: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. రేపటి వరకే మా డెడ్‌లైన్‌!: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌

  • పలు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలు కదులుతున్నాయి
  • బీజేపీ తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి
  • మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం

బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్‌ కర్ణాటక నేత డీకే శివకుమార్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకుండా బీజేపీని ఆహ్వానించడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము రేపటి వరకు వేచి చూస్తామని, తమకు న్యాయం జరుగుతుందని తాము అనుకుంటున్నామని అన్నారు. పలు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని అడుగుతున్నాయని, బీజేపీ తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు.

కాగా, బీహార్‌లోని ఆర్జేడీ, గోవాలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్‌ రేపు తమ తమ రాష్ట్రాల గవర్నర్ల అపాయింట్‌మెంట్‌ అడిగారు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లే, తమ రాష్ట్రాల్లో తమని ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రేపు వారంతా తమ గవర్నర్లని కలవనున్నారు.   

  • Loading...

More Telugu News