Mahanati: అప్పట్లోనే తొలి ల్యాప్ టాప్, విత్ వైఫై అండ్ వీడియో చాట్!: సాక్ష్యం ఇదేనన్న నాగార్జున!

  • మాయాబజార్ లోని ఓ సీన్ ను పోస్ట్ చేసిన నాగార్జున
  • ప్రియదర్శిని ముందు 'మహానటి' సావిత్రి
  • వైరల్ అవుతున్న ట్వీట్
భారతీయులు 1957లోనే తొలి ల్యాప్ టాప్ ను చూపించారని, దానిలో వైఫై, వీడియో చాటింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయని, దానికి ఇదే సాక్ష్యమంటూ హీరో నాగార్జున పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలనాటి మహత్తర పౌరాణిక చిత్రం 'మాయాబజార్' చిత్రంలో భాగంగా తీసిన ఓ సీన్ ను ఆయన పోస్ట్ చేస్తూ, 'డోంట్ మిస్ ఇట్' అని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో 'మాయాబజార్' చిత్రంలో శశిరేఖగా సావిత్రి నటిస్తూ, మనసులోని కోరికను చూపించే 'ప్రియదర్శిని' ముందు తీసిన సీన్, ఆపై వచ్చే 'నీవేనా నను తలచినది' సాంగ్ ఉన్నాయి. 
Mahanati
Nagarjuna
First Laptom
Video Chat
Twitter

More Telugu News