ndrf: లాంచీని ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. నాలుగు మృతదేహాల వెలికితీత

  • భారీ క్రేన్లను వినియోగించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • లాంచీలో మరిన్ని మృతదేహాలు?
  • సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్న చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరినదిలో మునిగిపోయిన లాంచీని భారీ క్రేన్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీశాయి. ఈ బృందాలు ప్రస్తుతం లాంచీలోని మృతదేహాలను వెలికితీస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు మొత్తం ఇద్దరు బాలురు సహా నలుగురి మృతదేహాలు వెలికితీశారని అన్నారు. నిన్న సాయంత్రం పెనుగాలులకు అదుపుతప్పి లాంచీ నీట మునిగిందని అంటున్నారు. వాడపల్లిలో జరుగుతోన్న ఈ సహాయక చర్యలను సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.  

  • Loading...

More Telugu News