ram madhav: బీజేపీ నేత రామ్ మాధవ్ కు మాతృ వియోగం

  • రామ్ మాధవ్ తల్లి జానకిదేవి మృతి
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకిదేవి
  • రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి జానకిదేవి కన్ను మూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాదులో జరగనున్నాయి.

ఈ సందర్భంగా రామ్ మాధవ్ కు పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. తెలుగువాడైన రామ్ మాధవ్ బీజేపీలో ఉన్నత స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు వెనుక ఆయన వ్యూహాలు ఉన్నాయి. మోదీ, అమిత్ షాల టీమ్ లో రామ్ మాధవ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ram madhav
bjp
mother
dead

More Telugu News