kanna: లాంచీ దుర్ఘటన.. రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: కన్నా డిమాండ్

  • ఈ దుర్ఘటన చాలా బాధాకరం
  • మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా
  • పాతగుంటూరు ఘటనను ఖండిస్తున్నా
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలి
తూర్పుగోదావరి జిల్లా మంటూరు - పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య నిన్న సాయంత్రం గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన సంఘటనపై ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. గోదావరిలో మునిగిపోయిన లాంచీ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా పాతగుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటనను ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
kanna
godavari

More Telugu News