bigboss 2: తెలుగు 'బిగ్ బాస్-2'కు మరింత గ్లామర్.. పార్టిసిపెంట్ల లిస్ట్ లో అందాల భామలు!

  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు బిగ్ బాస్-2
  • సెట్ కూడా రెడీ అయిపోయింది
  • సీజన్-2లో గజాలా, తేజస్వి, గీతామాధురి, రాశి
బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాల్టీ షో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో భారీ సక్సెస్ ను సాధించింది. ఇప్పడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు సమయం ఆసన్నమైంది. సెట్ కూడా రెడీ అయిపోయినట్టు సమాచారం. బిగ్ బాస్-2ను హీరో నాని హోస్ట్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ షోకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సీజన్-1 కంటే సీజన్-2 మరింత గ్లామరస్ గా ఉండబోతోందని అంటున్నారు. ఇందులో హీరోయిన్లు గజాలా, తేజస్వి, సీనియర్ నటి రాశి, సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలలు పార్టిసిపేట్ చేయబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి బిగ్ బాస్ మేనేజ్ మెంట్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
bigboss 2
ntr
nani
geetha madhuri
gajala
tejaswi
shyamala
raasi

More Telugu News