kona venkat: ఈవీఎం అంటే ‘ఎవ్రిబడీ ఓటెడ్‌ ఫర్‌ మోదీ’: కోన వెంకట్‌ ఆసక్తికర వ్యాఖ్య

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కమల వికాసం
  • మోదీపై టాలీవుడ్‌ ప్రముఖుల ట్వీట్లు
  • నో కామెంట్స్‌ అని పేర్కొన్న కోన వెంకట్
కర్ణాటక ఎన్నికలపై టాలీవుడ్‌ ప్రముఖులు కూడా అమితాసక్తి చూపుతున్నారు. ప్రధాని మోదీ మెజీషియన్ లా కనిపిస్తున్నారని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినీ రచయిత కోన వెంకట్‌ కూడా మోదీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)కు ఆయన కొత్త అర్థం చెబుతూ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా ఉంది. కర్ణాటకలో ఈవీఎంలు తెరిచినప్పుడు ‘ఎవ్రిబడీ ఓటెడ్‌ ఫర్‌ మోదీ’ అని ఫలితాలు వచ్చాయని, నో కామెంట్స్‌ అని కోన వెంకట్ పేర్కొన్నారు. వరుసగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ని ఓడిస్తూ వచ్చిన కమలం పార్టీ కర్ణాటకలోనూ వికసించడం విశేషమే. 
kona venkat
Narendra Modi
evm

More Telugu News