keerti suresh: తొలి 5 రోజుల్లో 'మహానటి' వసూళ్లు .. ఆశ్చర్యపోవలసిందే!

  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • అమెరికాలోను అదే జోరు 
  • ప్రపంచవ్యాప్తంగా 16.2 కోట్ల షేర్

'మహానటి' ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెరగకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రల ఎంపిక మొదలైన దగ్గర నుంచి అంచనాలు పెరగడం మొదలయ్యాయి. ఇక పోస్టర్స్ బయటికి రావడంతో అందరిలో ఆసక్తి పతాకస్థాయికి చేరుకుంది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి 5 రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 3.5 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 7.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అమెరికాలో 6.6 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ 5 రోజుల్లో ఈ సినిమా 16.2 కోట్ల షేర్ ను వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. 

  • Loading...

More Telugu News