thammareddy bharadwaja: 'వేటగాడు' ఓ చేదు జ్ఞాపకం .. మరిచిపోవడం మంచిది: తమ్మారెడ్డి భరద్వాజ

  • వేటగాడు' 20 యేళ్ల క్రితం సంగతి
  • జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది
  • గుర్తుకు చేసుకుని ప్రయోజనం లేదు   

దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా ఉద్యమ స్ఫూర్తి కలిగినవి .. సందేశంతో కూడినవి కనిపిస్తాయి. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "షారుక్ ఖాన్ హీరోగా చేసిన 'బాజీఘర్' హిందీలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కుని వచ్చి తెలుగులో రాజశేఖర్ హీరోగా 'వేటగాడు' సినిమా చేశారు. ఆ సినిమాకి సంబంధించిన విషయాలను చెప్పండి?" అంటూ అలీ అడిగాడు.

అందుకాయన స్పందిస్తూ .. "ఇది 20 సంవత్సరాల క్రితం విషయం .. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరమనిపిస్తోంది. జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .. ఇప్పుడు మళ్లీ ఆ విషయాలను నెమరువేసుకోవడం వలన ప్రయోజనం లేదు. మంచి జ్ఞాపకమే అయితే ఎప్పుడైనా నెమరు వేసుకోవచ్చు .. మంచి జ్ఞాపకం కాదది .. దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది" అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News