Karnataka elections: మాటలకు, చేతలకు లేని పొంతన... కర్ణాటకలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలు

  • బీజేపీ నిలబెట్టిన మహిళా అభ్యర్థులు ఆరుగురే
  • కాంగ్రెస్ నుంచి 15, జేడీఎస్ నుంచి నలుగురు
  • మొత్తం మీద 8 శాతానికే పరిమితం

కర్ణాటక ఎన్నికల్లో మహిళల కేంద్రంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ప్రధాని మోదీ అయితే భేటా భేటి ఏక్ సమాన్ అని కూడా ప్రకటన చేశారు. కానీ, ఇవన్నీ మాటలకే పరిమితం. ఎందుకంటే 224 స్థానాలున్న కర్ణాటకలో బీజేపీ నిలబెట్టిన మహిళా అభ్యర్థులు ఆరుగురే. శాతం వారీగా చూస్తే 3 శాతం.

ఇక కాంగ్రెస్ 15 మంది మహిళలకు టికెట్లు ఇచ్చి కాస్తంత మెరుగ్గా ఉంది. జేడీఎస్ నలుగురు మహిళలకు అవకాశం ఇచ్చింది. మొత్తం మీద అన్ని పార్టీలు కలసి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను 8 శాతానికే పరిమితం చేశాయి. ప్రస్తుత సభలో కేవలం ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలే ఉన్నారు. దేశంలో అతి తక్కువ మహిళా ప్రాతినిధ్యం ఉన్న అసెంబ్లీ ఇదే కావడం గమనార్హం. మన నేతలు మహిాళా సాధికారత విషయంలో మాటలకే పరిమితమని మరోసారి రుజువు చేశారు.

  • Loading...

More Telugu News