Karnataka: 0.3 శాతం ఓట్ల తేడాలో భారీ నష్టం... కాంగ్రెస్ కు తగ్గిన ఓట్లు 32 వేలు, పోయిన సీట్లు 50!

  • ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర లెక్క
  • రెండు పార్టీల మధ్యా ఓట్ల తేడా 0.3 శాతమే
  • 114 చోట్ల ఆధిక్యంలో బీజేపీ, 66 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్

కన్నడనాట ఎన్నికల ఫలితాల్లో ఇది ఓ ఆసక్తికరమైన లెక్క. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దాదాపు చెరిసమానంగానే ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్యా ఓట్ల తేడా కేవలం 0.3 శాతం మాత్రమేనని ఎలక్షన్ కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

లెక్కించిన ఓట్లలో 37.6 శాతంగా 40.88 లక్షల ఓట్లు బీజేపీకి రాగా, 37.3 శాతం ఓట్ షేర్ గా 40.56 లక్షల ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. కాంగ్రెస్ కన్నా బీజేపీకి 32 వేల ఓట్లు మాత్రమే అధికంగా పోల్ అయినట్టు తెలుస్తుండగా, ఆధిక్యంలో ఉన్న సీట్ల విషయంలో మాత్రం రెట్టింపు తేడా కనిపిస్తోంది. కేవలం 32 వేల ఓట్ల తేడాకు కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల్లో వెనుకంజలో ఉంది. ప్రస్తుతం బీజేపీ 114 చోట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 66, జేడీఎస్ 40 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News