geetamadhuri: 'బిగ్ బాస్ 2'లో గీతామాధురి .. తరుణ్

  • 'బిగ్ బాస్ 2'కి సన్నాహాలు
  • అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్
  • త్వరలో ప్రోమో రిలీజ్  

తెలుగు రియాలిటీ షోగా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్' కార్యక్రమానికి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమం 'స్టార్ మా' రేటింగ్స్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో సీజన్ ను త్వరలో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రితం సారి ముంబై సమీపంలో చేసిన ఈ కార్యక్రమాన్ని, ఈ సారి అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చేయనున్నారు. ఈ సారి ఈ కార్యక్రమానికి 'నాని' హోస్ట్ గా వ్యవహరించనుండగా, కంటెస్టెంట్స్ గా హీరో తరుణ్ .. హీరోయిన్ తేజస్వి మదివాడ .. సింగర్ గీతామాధురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కాగలరనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా లోగోను రిలీజ్ చేసిన నిర్వాహకులు, త్వరలో ప్రోమోను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండవ సీజన్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

  • Loading...

More Telugu News