sharwanand: 'బ్రహ్మోత్సవం' దర్శకుడితో శర్వానంద్?

  • శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
  • హీరోగా తెరపైకి శర్వానంద్ పేరు 
  • అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథ  
'కొత్త బంగారు లోకం'తో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల, ఆ తరువాత 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా తెరకెక్కించే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే మహేశ్  బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలు కావడంతో, ఆయన మరో సినిమా చేయడానికి సహజంగానే గ్యాప్ వచ్చింది.రీసెంట్ గా ఆయన శర్వానంద్ కి ఒక కథను వినిపించాడనీ, కథాకథనాలు కొత్తగా ఉండటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది తాజా సమాచారం. ఇది అన్నదమ్ముల నేపథ్యంలో కొనసాగే కథ అనీ, యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో వుంటాయని అంటున్నారు. ఈ కథకి శర్వానంద్ ఓకే చెప్పడం నిజమే అయితే, మరో కథానాయకుడిగా ఎవరు కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. 
sharwanand
srikanth addala

More Telugu News