BJP: జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్, గెహ్లాట్!

  • హంగ్ దిశగా ఫలితాలు
  • జేడీఎస్ కు డిప్యూటీ సీఎం పదవి
  • చర్చలు మొదలు పెట్టిన కాంగ్రెస్ నేతలు

కర్ణాటకలో హంగ్ ప్రభుత్వమే రానుందన్న సంకేతాలకు బలం చేకూర్చేలా ఫలితాలు వెల్లడవుతున్న వేళ, ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్)తో మంతనాలు ప్రారంభించింది. ఫలితాలు హంగ్ దిశగా వస్తాయని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, జాతీయ రాజకీయాల్లో తలపండిన గులాంనబీ ఆజాద్, గెహ్లాట్ తదితరులను నిన్ననే బెంగళూరుకు పంపగా, ప్రస్తుతం జేడీఎస్ నేతలతో వారు చర్చలు ప్రారంభించారు.

ఇప్పటికే హంగ్ తప్పదని తేలడంతో జేడీఎస్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకుంటే, జేడీఎస్ ను ఎన్డీయేలో చేర్చుకుని ఆ పార్టీ నేత కుమారస్వామిని సీఎం చేసేందుకు తమకు అభ్యంతరం లేదని బీజేపీ సైతం సంకేతాలు పంపింది. ఏదిఏమైనా, కన్నడనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

More Telugu News