Andhra Pradesh: కృష్ణా జిల్లా ప్రజలారా జర భద్రం.. హెచ్చరించిన విపత్తుల నిర్వహణ శాఖ

  • జిల్లాలోని ఐదు మండలాల్లో నేడు పిడుగులు పడే అవకాశం
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన
  • భయపెడుతున్న వాతావరణ మార్పులు

కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించి పిడుగులు పడుతుండడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సోమవారం పిడుగుపాటుకు గుంటూరు జిల్లా గురజాల మండలంలోని సమాధానంపేటలో క్రికెట్ ఆడుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అలాగే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖతోపాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News