Karnataka: తెరచుకున్న పెట్టెలు... తొలి ఆధిక్యం జేడీఎస్ కు!

  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • ఆధిక్యంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర
  • రామనగరంలో కుమారస్వామి ముందంజ
కోట్లాదిమంది అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తున్నారు. తొలి ఆధిక్యాన్ని దేవెగౌడ, కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) కూటమి సొంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్రెండ్స్ వెలువడుతుండగా, కాంగ్రెస్ 6, బీజేపీ 7, జేడీఎస్ 4 చోట్ల ఆధిక్యం చూపుతున్నాయి. హోలెనరాసిపురాలో జేడీఎస్ అభ్యర్థి హెచ్డీ రేవణ్ణ ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. హరప్పనహళ్ళిలో బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి, రామనగరంలో జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి, వరుణలో సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి యతీంద్ర ఆధిక్యంలో ఉన్నారు.
Karnataka
Assembly Elections
Polls
Trends
JDC
BJP
Congress

More Telugu News