Karnataka: మరో పది నిమిషాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 9 గంటలకే ట్రెండ్ బయటకు

  • ఓట్లు లెక్కింపు ప్రారంభమైన గంటకే సరళి వెల్లడి
  • లెక్కింపులో పాల్గొననున్న11 వేల మంది సిబ్బంది
  • మధ్యాహ్నానికి స్పష్టత

దేశ రాజకీయాలపై ఎంతోకొంత ప్రభావం చూపే కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఓట్ల లెక్కింపులో మొత్తం 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ప్రతీ టేబుల్ వద్ద లెక్కింపును 100 మంది పర్యవేక్షించనున్నారు. 9 గంటలకల్లా సరళి వెల్లడి కానుంది. మధ్యాహ్నానికి గెలుపెవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలో వంద మీటర్ల వరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగళూరులో 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రంలోనూ 14 టేబుళ్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్, జవదేవకర్ వ్యవహరించనుండగా, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లట్, ఆజాద్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News