Jagan: అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది వైఎస్ అనుచరుడు కోలా ఆనంద్ మనుషులే!: కేఈ ఆరోపణ

  • బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయి
  • బీజేపీ నేతలపై వాలిన ఈగలను తోలే బంట్రోతు జగన్
  • జగన్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలపై వాలిన ఈగలను తోలే బంట్రోతు జగన్ అని, ఆ పార్టీకి అద్దె మైకుగా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. అమిత్ షా కాన్వాయ్ పై చంద్రబాబు దాడి చేయించాడన్న జగన్ వ్యాఖ్యలను చూస్తుంటే, బీజేపీ-వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని తెలుస్తోందని అన్నారు. అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసింది వైఎస్ అనుచరుడైన కోలా ఆనంద్ మనుషులేనని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News