indigo: కాస్త మర్యాదగా వ్యవహరించండి.. తమ సిబ్బందికి ఇండిగో సూచనలు!

  • గొడవ జరిగే సూచనలు కనపడితే పరిష్కరించాలి
  • అంతేగానీ గొంతు పెంచి మాట్లాడకూడదు
  • సమస్యకు పరిష్కారాన్ని వెంటనే కనుగొనాలి
ఎలాంటి సమయాల్లోనైనా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించండంటూ ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో తమ సిబ్బందికి పలు సూచనలు చేసింది. ఒకవేళ ప్రయాణికులతో గొడవ జరిగే సూచనలు కనిపిస్తే వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికే ప్రయత్నించాలని, వారితో మాట్లాడేటప్పుడు గొంతు పెంచి మాట్లాడకూడదని తెలిపింది.

గొడవలు జరిగిన తర్వాత దానికి క్షమాపణ లేఖ పెట్టడమనేది సరైంది కాదని, గొడవ జరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని, సమస్యకు పరిష్కారాన్ని వెంటనే కనుగొనాలని సూచించింది. తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రమే ప్రయాణికులపై కఠినంగా వ్యవహరించాలని తమ సిబ్బందికి చెప్పింది. కాగా, ప్రయాణికులతో ఇండిగో విమానయాన సిబ్బంది అనుచితంగా వ్యవహరిస్తున్నారని పలుసార్లు విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.
indigo
airlines

More Telugu News