vijay devarakonda: క్రికెటర్ గా రష్మిక మందన .. క్రికెట్ క్లబ్ లో శిక్షణ

  • విజయ్ దేవరకొండ హీరోగా 'డియర్ కామ్రేడ్'
  • కథానాయికగా రష్మిక మందన 
  • జూన్ లో రెగ్యులర్ షూటింగ్    
'ఛలో' సినిమా  ద్వారా తెలుగు తెరకి పరిచయమైన రష్మిక మందన, కుర్రకారు హృదయాలను దోచేసింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టేయడం .. సక్సెస్ ను సొంతం చేసుకోవడం వలన, ఈ సుందరికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలా విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమా చేయనుంది. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి, భరత్ కమ్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఇందులో రష్మిక మందన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఒక క్రికెటర్ గా కనిపించనుంది. పాత్రలో సహజత్వం లోపించకుండా ఉండటం కోసం రష్మిక ఇప్పుడు క్రికెట్ నేర్చుకుంటోంది. హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో ఆమె శిక్షణ పొందుతోందట. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఆమె వుంది. ఇక మలయాళంలో దుల్కర్ చేసిన 'కామ్రేడ్ ఇన్ అమెరికా ' సినిమాకి .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని ఇటీవల భరత్ కమ్మ చెప్పిన సంగతి తెలిసిందే.  
vijay devarakonda
rashmika

More Telugu News