ram: ఆకట్టుకుంటోన్న 'హలో గురు ప్రేమకోసమే' ఫస్టులుక్

  • రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే'
  • దర్శకుడిగా త్రినాథరావు నక్కిన 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రేపు రామ్ పుట్టినరోజు కావడంతో .. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫస్టులుక్ ను వదిలారు.

 రామ్ .. అనుపమ పరమేశ్వరన్ ను ఫాలో అవుతున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. కొత్త లుక్ తో రామ్ గతంలో కంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. 'నేను శైలజ' తరువాత రామ్ కి ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి. 

More Telugu News