Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • కమ్ముకున్న మేఘాలు
  • చల్లబడ్డ వాతావరణం
  • పలు ప్రాంతాల్లో చిరు జల్లులు
చిరుజల్లులు కురవడంతో హైదరాబాదీయులు సేదదీరారు. ఉదయం 9 గంటల నుంచే ఎండల వేడితో ఉక్కపోతను ఎదుర్కుంటోన్న నగరవాసులు ప్రస్తుతం చల్లటి వాతావరణాన్ని చూస్తున్నారు. మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణంలో వచ్చిన మార్పు ఆహ్లాదాన్నిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది.

సికింద్రాబాద్, సీతాఫల్‌ మండి, పద్మారావు నగర్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారంగేట్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌, ఈసీఐఎల్, నాగారం, కుషాయిగూడ, తార్నాక, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్‌, లాలాపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.                 
Hyderabad
rain

More Telugu News