vijay devarakonda: 'టాక్సీవాలా' రిలీజ్ గురించి చెప్పిన విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
  • కథానాయికలుగా మాళవిక శర్మ .. ప్రియాంక 
  • జూన్ లో ప్రేక్షకుల ముందుకు 

విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' చిత్రం రూపొందింది. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

 ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదనీ, అందువలన విడుదల తేదీని వాయిదా వేయవలసి వచ్చిందని అన్నాడు. జూన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనీ, తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పాడు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. ప్రియాంక కథానాయికలుగా కనిపించనున్నారు.      

More Telugu News