raviteja: 'నేల టిక్కెట్టు' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

  • రవితేజ హీరోగా 'నేల టిక్కెట్టు'
  • ఈ నెల 16వ తేదీన వస్తోన్న ట్రైలర్  
  • 25వ తేదీన విడుదలవుతోన్న సినిమా

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'నేల టిక్కెట్టు ' సినిమా రూపొందింది. మాస్.. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేలా ఆయన ఈ సినిమాను సిద్ధం చేశాడు. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా ఇటీవలే ఆడియో వేడుకను జరుపుకుంది. పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ వేడుక వైభవంగా జరిగింది. ఆ రోజున ట్రైలర్ రిలీజ్ కూడా చేయాలనుకున్నారు గానీ .. అప్పటికి అది రెడీకాకపోవడం వలన కుదరలేదు. అందువలన ట్రైలర్ ను ఈ నెల 16వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ట్రైలర్ తో సినిమాపై మరింతగా ఆసక్తి పెరగడం ఖాయమని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో కల్యాణ్ కృష్ణ వున్నాడు.  

More Telugu News