Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను అభినందించాల్సిందే: విజయసాయిరెడ్డి

  • బస్సు యాత్రపై స్పందించిన విజయసాయి
  • సమస్యలపై ఎవరు పోరాడినా ఆనందమే
  • విశాఖలో మీడియాతో వైసీపీ ఎంపీ
ప్రస్తుతం మూడు రోజుల యాత్ర నిమిత్తం తిరుమలలో బస చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఉదయం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలపై ఎవరు పోరాటం ప్రారంభించినా తనకు సంతోషమేనని చెప్పారు. సమస్యలపై కదిలిన పవన్ ను అభినందించాల్సిందేనని, సమస్యలకు పరిష్కారం లభిస్తే ఇంకా ఆనందమని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకూ సాగనుంది.
Pawan Kalyan
Vijayasai Reddy
Vizag
Bus Tour

More Telugu News