Mahesh Babu: అదంతా అసత్యమే... మహేష్ బాబు నాకు బెస్ట్ ఫ్రెండ్!: రామ్ చరణ్

  • మహేష్ తో పోటీ పడుతున్న రామ్ చరణ్
  • జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డ మెగా హీరో
  • ఎవరి కలెక్షన్లు ఎంతని లెక్కలు వేయడం లేదని వెల్లడి

మహేష్ బాబు సినిమాల విడుదల సమయానికే తన సినిమాలను పోటీగా విడుదల చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మండిపడ్డాడు. ఇదంతా కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారమని, తనకు మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ అని, తమిద్దరి మధ్యా ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశాడు. ఎవరి సినిమా కలెక్షన్లు ఎక్కువన్న విషయాన్ని తాము ఎన్నడూ లెక్కించలేదని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు.

తన చిత్రం 'రంగస్థలం', మహేష్ మూవీ 'భరత్ అనే నేను' రెండూ సూపర్ హిట్ కావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. పర్సనల్ హిట్ కొట్టడం కన్నా, ఇండస్ట్రీకి మరో హిట్ లభించిందన్న అంశమే తనకు ముఖ్యమని చెప్పాడు. కాగా, 'రంగస్థలం' విడుదలైన 20 రోజుల తరువాత 'భరత్ అనే నేను' విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ రెండు సినిమాల విడుదల తేదీ క్లాష్ కాగా, నిర్మాతలు కూర్చుని చర్చించుకుని సినిమాల మధ్య కనీసం మూడు వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News