poonam kaur: ఓ డైరెక్టర్ నా వ్యక్తిగత జీవితంతో ఆడుకుంటున్నాడు: పూనం కౌర్ ఆరోపణ

  • హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు
  • ఆయనకు నచ్చిన హీరోయిన్లకే అవకాశాలు ఇస్తున్నాడు
  • నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు
హీరోయిన్ల జీవితాలతో ఓ దర్శకుడు ఆడుకుంటున్నాడని హీరోయిన్ పూనం కౌర్ ఆరోపించింది. ఆ దర్శకుడికి ఎక్కువ సినిమాలు లేనప్పటికీ, హీరోయిన్లతో ఆడుకుంటున్నాడని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంలో కూడా జోక్యం చేసుకుంటున్నాడని, తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడింది.

ఈ విషయాలపై ఆయనను డైరెక్ట్ గా నిలదీశానని, అయితే, తనకేమీ తెలియదని బదులిచ్చాడని చెప్పింది. ఆయనకు కావాల్సిన హీరోయిన్లకు వరుసగా ఫ్లాప్ లు ఉన్నప్పటికీ, వారికే అవకాశాలు ఇస్తున్నాడని తెలిపింది. ఆయనకు సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పింది. అతని చర్యలే చివరకు అతనికి తగిన శిక్షను విధిస్తాయని తెలిపింది. అయితే, ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం పూనం చెప్పలేదు.  
poonam kaur
tollywood
director
harrassment

More Telugu News