Hyderabad: హైదరాబాద్‌లో పెచ్చుమీరుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు!

  • నిబంధనలు, జరిమానాలకు వెరవని వాహనదారులు
  • రెచ్చిపోతున్న ‘ఉల్లంఘనులు’
  • వేలల్లో కేసులు నమోదు
  • క్రమశిక్షణ లేమే కారణమంటున్న నిపుణులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెచ్చుమీరుతున్నాయి. అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లు పరిపాటిగా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తున్న 78,615 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్‌పై 17,689, సిగ్నల్ జంపింగ్‌పై 6,060 కేసులు నమోదు చేశారు. ప్రమాదకర డ్రైవింగ్‌పై 3,340, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్‌పై 730 కేసులు నమోదు చేశారు.

వాహనదారుల్లో క్రమశిక్షణ లేమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీ పాయింట్ సిస్టం అమల్లోకి వచ్చినా ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. చాలా కేసుల్లో పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని రోడ్ సేఫ్టీ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News