Pakistan: నేను చెప్పిందొకటి, రాసుకున్నది మరొకటి: ఇండియాపై ఉగ్రదాడుల విషయంలో మాట మార్చిన నవాజ్ షరీఫ్

  • తలచుకుంటే ముంబై ఉగ్రదాడిని ఆపి ఉండే వాళ్లమన్న నవాజ్
  • తీవ్ర విమర్శలు చేస్తున్న స్వపక్ష, విపక్షాలు
  • నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం
  • వివరణ ఇచ్చిన పాక్ మాజీ ప్రధాని
తాము తలచుకుంటే 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడులను నిలువరించగలిగి ఉండేవాళ్లమని, పాక్ భూ భాగంపై ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమేనని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చెప్పిన మాటలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, పాకిస్థాన్ లో మిలిటెంట్ సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని, సరిహద్దులు దాటి ముంబైకి వెళ్లి ప్రజలను చంపే ఆలోచనను సమర్థించి వుండాల్సింది కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో, షరీఫ్ తరఫు ప్రతినిధి మీడియాకు వివరణ ఇస్తూ, "నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత మీడియా వక్రీకరించింది. దురదృష్టవశాత్తూ పాక్ లోని కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే ప్రచారం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండానే ఈ ప్రచారం జరిగింది. షరీఫ్ ప్రకటనలోని భావాన్ని భారత మీడియా పట్టించుకోలేదు" అని తెలిపారు. కాగా, దేశపు పరువు తీసేలా వ్యాఖ్యానించిన షరీఫ్ పై ఇప్పుడు విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు.
Pakistan
Mumbai
Nawaz Sharif

More Telugu News