'భర్తను చంపించిన భార్య' కేసులో... ప్రియుడు శివ అరెస్ట్!
- విజయనగరం జిల్లాలో కలకలం రేపిన హత్య
- పెళ్లయిన పది రోజులకే భర్తను చంపించిన యువతి
- పోలీసుల అదుపులో కీలక సూత్రధారి శివ
ఇప్పటికే సరస్వతి సహా హత్యలో భాగం పంచుకున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కీలక సూత్రధారి శివను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఈ కేసును సీరియస్ గా తీసుకుని శివ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, వారు ఓ పథకం ప్రకారం శివను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అరెస్ట్ చేసిన శివను పార్వతీపురం తరలించి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.