indore: కేసు నమోదైన 23 రోజుల్లోనే తీర్పు.. మృగాడికి మరణ శిక్ష విధించిన ఇండోర్‌ జిల్లా కోర్టు!

  • అమ్మ పక్కన నిద్రిస్తోన్న పసిపాపను ఎత్తుకెళ్లిన మృగాడు
  • ఆపై దారుణానికి పాల్పడ్డ వైనం
  • పాపకు ఏడవడం తప్ప మరేమీ తెలియదంటూ న్యాయమూర్తి వ్యాఖ్య

నాలుగు నెలల పసిపాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నవీన్‌ గడ్కే అనే 21 ఏళ్ల మృగాడికి ఇండోర్‌ జిల్లా కోర్టు మరణశిక్ష విధిస్తూ దేశంలోనే అతి వేగవంతంగా తీర్పును వెల్లడించింది. కేసు నమోదైన 23 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, తీర్పునిస్తూ.. పసిపాపపై ఇంతటి దారుణానికి పాల్పడడం ఘోరమని, ఆ పాపకు ఏడవడం తప్ప మరేమీ తెలియదని న్యాయమూర్తి వర్ష శర్మ వ్యాఖ్యానించారు.

ఈ అత్యాచార ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెలలో చోటు చేసుకుంది. రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో త‌ల్లి ప‌క్క‌న నిద్రిస్తోన్న చిన్నారిని ఎత్తుకెళ్లిన మృగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసును అరుదైన కేసుగా పరిగణించాలని, దోషికి మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్రమ్ షేక్ కోర్టును కోరడంతో న్యాయమూర్తి అందుకు సానుకూలంగా స్పందించారు.

  • Loading...

More Telugu News