Karnataka: ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

  • చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం
  • సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌
  • కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్‌ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదు కాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాసేపట్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమ పార్టీయే విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ నేతలు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.    
Karnataka
elections
assembly

More Telugu News