adivi shesh: స్పై థ్రిల్లర్ గా 'గూఢచారి' .. అమెరికాలో షూటింగ్ పూర్తి

  • శశికిరణ్ తిక్క దర్శకత్వంలో 'గూఢచారి'
  • అడవి శేష్ జోడీగా శోభిత 
  • హిమాచల్ ప్రదేశ్ లో నెక్స్ట్ షెడ్యూల్  
అడవి శేష్ హీరోగా 'గూఢచారి' సినిమా రూపొందుతోంది. స్పై థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా శోభిత ధూళిపాళ నటిస్తోంది. కొంతకాలంగా ఈ సినిమా షూటింగును అమెరికాలో జరుపుతూ వస్తున్నారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. తాజాగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేశారు.

తదుపరి షెడ్యూల్ ను హిమాచల్ ప్రదేశ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తూ లొకేషన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. త్వరలోనే అక్కడ షూటింగును మొదలుపెట్టనున్నారు. అభిషేక్ పిక్చర్స్ .. పీపుల్స్ మీడియా వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను యార్లగడ్డ సుప్రియ పోషిస్తుండటం విశేషం.   
adivi shesh
sobhitha

More Telugu News