Konda Surekha: కొండా సురేఖ దంపతులను జనాలు ఛీ కొడుతున్నారు: శాయంపేట ఎంపీపీ బాసని రమాదేవి

  • శాయంపేట ఎమ్మెల్యేగా సురేఖ పదేళ్లు ఉన్నారు
  • నియోజకవర్గానికి చేసిందేమీ లేదు
  • వరంగల్ తూర్పులో ఎదురుగాలి వీస్తుంటే... ఇప్పుడు భూపాలపల్లి వైపు చేస్తున్నారు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ, కొండా మురళిలను జనాలు ఛీ కొడుతున్నారని శాయంపేట ఎంపీపీ బాసని రమాదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాయంపేట ఎమ్మెల్యేగా 10 ఏళ్లు ఉన్న సురేఖ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుండటంతో... ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వీరు భావిస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారని... ప్రజలందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని కితాబిచ్చారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులను ఎవరూ నమ్మడం లేదని రమాదేవి అన్నారు.
Konda Surekha
konda murali
basani ramadevi
sayampet
bhupalpally
warangal east

More Telugu News