దాచేపల్లిలో మరో దారుణం.. బాలికపై ఎంపీటీసీ భర్త అత్యాచారం!
- పదమూడేళ్ల బాలికపై ఎంపీటీసీ భర్త మాబూవలీ అత్యాచారం
- ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ బెదిరింపులు
- స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- బాలిక మూడు నెలల గర్భవతిగా తేల్చిన వైద్యులు
ఎట్టకేలకు, స్థానికుల సహకారంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు సదరు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.