Karnataka ELECTIONS: దేశ పౌరులుగా మీ హక్కు వినియోగించుకోండి... అనిల్ కుంబ్లే పిలుపు... నెట్ లో వైరల్

  • కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంబ్లే
  • కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీ తీసుకుని పోస్టింగ్
  • దీనికి 17 వేల మంది ‘లైక్’
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ట్విట్టర్ వేదికగా ఓటర్లకు వినూత్నంగా పిలుపునిచ్చారు. ఈ దేశ పౌరులుగా మీ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ బూత్ ముందు వేచి ఉన్న సమయంలో కుంబ్లే సెల్ఫీ తీసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ వంతు వరకు వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఆ తర్వాత ఓటు వేసి వచ్చిన అనంతరం సిరా గుర్తు చూపిస్తూ మరో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. కుంబ్లే పోస్టింగ్ కు వెంటనే 17 వేల మంది లైక్ కొట్టగా, 200 మంది రీట్వీట్ చేశారు. ఈ ఉదయం 7 గంటలకు కర్ణాటక వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి రెండు గంటల్లో 10.6 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఇది కొనసాగనుంది.
Karnataka ELECTIONS
anil kumble

More Telugu News