hero vishal: హిందూ సంస్థల హెచ్చరిక .. హీరో విశాల్ ఇంటికి పోలీస్ భద్రత

  • విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ విడుదల
  • ఈ సినిమాలో ‘ఆధార్ కార్డు’, ‘డిజిటల్ ఇండియా’పై ప్రస్తావన  
  • నిరసిస్తున్న హిందూ సంస్థలు

మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ చిత్రం విడుదలైంది. ఆధార్ కార్డుకు సంబంధించి తప్పుడు సమాచారమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’పై ఈ చిత్రంలో విమర్శించినట్టు హిందూ సంస్థలు ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి.

 ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థలు హీరో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. కాగా, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.

More Telugu News